కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం | - | Sakshi
Sakshi News home page

కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడదాం

Jun 18 2026 7:58 AM | Updated on Jun 18 2026 7:58 AM

ిసీపీఐ మాజీ శాసనసభ పక్ష నేత చాడ వెంకట్‌ రెడ్డి

ిసీపీఐ మాజీ శాసనసభ పక్ష నేత చాడ వెంకట్‌ రెడ్డి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పి కొడదామని, సీపీఐ మాజీ శాసనసభ పక్ష నేత చాడ వెంకటరెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం సిద్దిపేటలో ఏఐటీయూసీ జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను రోజురోజుకు పెంచుతూ మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించి, వీబీజీ రాంజీ పథకం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి పవన్‌, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌, సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement