● లక్ష్యం అధిగమించాలి ● అధికారులతో మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలో ఈ ఏడాది 2వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం ఉందని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయిల్ ఫెడ్, హార్టికల్చర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో సాగు విస్తీర్ణం వివరాలపై అరా తీశారు. ఆయిల్‌పామ్ సాగును మరింత ప్రోత్సహించాలని, అందుకు రైతులకు మరింత అవగాహన కల్పించాలన్నారు. మెగా ప్లానిటేషన్ కోసం ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఆయిల్ ఫెడ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. పంట దెబ్బ తినకుండా సమయానికి, నీరు, ఫర్టిలైజర్ అందించాలని సూచించారు. కొత్త రైతులను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు సబ్సిడీపై పరికరాలు అందించాలన్నారు.
రూ.కోటితో అభివృద్ధి..
జిల్లా కేంద్రంలోని మచ్చవాని కుంటను రూ.కోటి నిధులతో పర్యాటక స్థలంగా అభివృద్ధి చేస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. మచ్చవాని కుంట అభివృద్ధి పనులను పరిశీలించారు. కుంట చుట్టూ బండ్, ఫుట్‌పాత్ రెలింగ్, లైజింగ్, ఓపెన్ జిమ్, పార్క్, నిర్మాణ పనులు చేస్తామన్నారు. మూడు కిలో మీటర్ల మేరకు వాకింగ్ ట్రాక్ ఉంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, నాయకులు సంపత్ రెడ్డి, వేణుగోపాల్, సురేష్, రాజు, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


