● పథకాలను సద్వినియోగం చేసుకోండి ● ఎంపీ రఘునందన్‌రావు
మిరుదొడ్డి(దుబ్బాక): కేంద్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తోందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు కోరారు. అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో సోమవారం రూ.50 లక్షల నిధులతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం సూర్య హర్‌ఘర్ ముఫ్తీ యోజన కింద మంజూరయ్యే సోలార్ విద్యుత్ ప్యానెల్ పథకాన్ని ఆర్‌సీసీ బంగ్లాలు కలిగిన వారు ఉపయోగించుకోవాలన్నారు.
మళ్లీ వచ్చేది ఎన్డీఏనే..
సిద్దిపేటజోన్: కేంద్రంలో నరేంద్రమోదీ నాయకత్వంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తంచేశారు. సోమవారం రాత్రి ఎన్జీవో భవన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన పూర్తి సందర్భంగా మేధావులతో సమావేశం నిర్వహించారు.


