ప్రజల ఆశలను వమ్ముచేశారు | - | Sakshi
Sakshi News home page

ప్రజల ఆశలను వమ్ముచేశారు

Jun 16 2026 7:19 AM | Updated on Jun 16 2026 7:19 AM

చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రజలకు ఆశ చూపి ఎన్నికల్లో గెలిచిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజలను నిరాశ పర్చారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మండల పరిధిలోని శంకరాయకుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలవికాస వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించి, సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. రైతులకు నేటికి పూర్తి స్థాయిలో రైతు భరోసా అందలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలు రేవంత్‌ రెడ్డి పాలనపై అసంతృప్తితో ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారన్నారు. అనంతరం వంద కుటుంబాలకు ఉచితంగా వాటర్‌ క్యాన్‌లు అందజేశారు. సర్పంచ్‌ మాకు మహేష్‌, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, నాయకులు రాధాకృష్ణ శర్మ, కాముని శ్రీనివాస్‌, పాపయ్య, కనకరాజు, బాలవికాస సంస్థ ప్రతినిధి శౌరి రెడ్డి, సర్పంచ్‌లు, నాయకులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement