మర్కూక్(గజ్వేల్): జిల్లాలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని, అశేష సంఖ్యలో దరఖాస్తులు రావడం అభినందనీయమని కలెక్టర్ హైమావతి తెలిపారు. మర్కూక్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన తెలంగాణ పబ్లిక్ పాఠశాలను జిల్లా విధ్యాధికారి వరగంటి శాస్త్రితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విధ్యాభివృద్ధి కోసం శాశ్వత భవనాల నిర్మాణానికి రూ.16కోట్ల 62లక్షలు మంజూరు చేసిందన్నారు. విద్యార్థులకు బస్సు సౌకర్యంతో పాటు, భోజనవసతి కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ సరిత, మండత విధ్యాధికారి ఉదయ్ భాస్కర్ రెడ్డి, ప్రాధానోపాధ్యాయులు వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


