వారాహి మాత సన్నిధిలో కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

వారాహి మాత సన్నిధిలో కలెక్టర్‌

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

కొండపాక(గజ్వేల్‌): కుకునూరుపల్లిలోని వారాహి ప్రత్యంగిరా శరభేశ్వర స్వామి దేవాయంలో ఆదివారం రాత్రి కలెక్టర్‌ హైమావతి ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవల దేవాలయాన్ని నిర్మించి ప్రారంభించారు. అనతి కాలంలోనే గొప్ప మహిమాన్విత దేవాలయంగా వెలుగొందుతోంది. ఈక్రమంలో కలెక్టర్‌ పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వేద మంత్రశ్ఛరణలతో పూర్ణ కుంభంతో స్వాతగం పలుకుతూ ఆలయ పూజారులు కలెక్టర్‌ను దేవాలయంలోకి ఆహ్వానించారు. అనంతరం దేవాలయ ట్రస్టు చైర్మన్‌ మమతారెడ్డితో పాటు అలయ పూజారులు దేవాలయ ప్రాశస్థాన్ని వివరించారు. ఈసందర్భంగా హైమావతి మాట్లాడుతూ దేవాలయం గొప్ప మహిమాన్విత భరితంగా వెలుగొందుతుందన్నారు. వారాహి మాత ఆశీస్సులతో ప్రాంతం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకంగా కోరామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement