● మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి
స్వామివారి రాజగోపురం
ఎదుట భక్తుల సందడి
కొమురవెల్లి మల్లన్న ఆలయం భక్తజన సంద్రమైంది. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్వామివారిని దర్శించుకుని, అభిషేకాలు, పట్నాలు, అర్చనలు, ప్రత్యేకపూజలు చేశారు. గంగిరేణు చెట్టువద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ స్వామివారిని దిర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదం అందించారు.
– కొమురవెల్లి(సిద్దిపేట)
విద్యార్థులకు వేసవి సెలవులు ముగియడం.. ఆదివారం సెలవు రోజు కావడంతో సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఉమ్మడి మెదక్‌జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ పుష్కరిణి, హల్దీనదివాగులో పుణ్యస్నానం చేశారు. కొండ గుహలో విశేషాలంకరణలో కొలువైన లక్ష్మీసమేత నృసింహస్వామివారిని దర్శించుకుని తరించారు. మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఈఓ రంగాచారి ఆధ్వర్యంలో సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నారు. – వర్గల్(గజ్వేల్)
దేవతామూర్తులను దర్శించుకుంటున్న భక్తులు


