● ముగిసిన వేసవి సెలవులు ● తిరుగు ప్రయాణమైన విద్యార్థులు
సిద్దిపేటకమాన్: విద్యార్థులకు వేసవి సెలవులు ముగియడంతో హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు తమ స్వగ్రామాల నుంచి పట్టణానికి వస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్టాండ్‌లు విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో కిటకిటలాడాయి. సెలవుల్లో ఆటలతో అల్లరి చేసి సరదాగా గడిపిన విద్యార్థులు పాఠశాలలు ప్రారంభం కావడంతో స్కూల్ బాట పట్టనున్నారు. వసతిగృహాల్లో ఉండి చదువుకునే విద్యార్థులు తమ లగేజీతో ఇంటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుగు ప్రయాణమయ్యారు.


