‘ఆపన్నహస్త మిత్ర బృందా’నికి అవార్డు | - | Sakshi
Sakshi News home page

‘ఆపన్నహస్త మిత్ర బృందా’నికి అవార్డు

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

గజ్వేల్‌రూరల్‌: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, అనారోగ్యం బారిన పడిన వారిని అక్కున చేర్చుకుంటూ.. వివిధ సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన కార్యక్రమాలను చేపడుతూ ముందుకు సాగుతున్న ‘ఆపన్నహస్త మిత్రబృందం’కు అరుదైన గౌరవం లభించింది. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా ఈ యేడాది జనవరి 23న తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సహకారంతో గజ్వేల్‌కు చెందిన ఆపన్నహస్త మిత్రబృందం 277 యూనిట్ల రక్తాన్ని సేకరించింది. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌శుక్ల చేతుల మీదుగా ‘అపన్నహస్త మిత్రబృందం’ అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా ఆపన్నహస్త మిత్రబృందం సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ అవార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆపన్నహస్త మిత్రబృందం అధ్యక్షుడు బాల్‌చంద్రం, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారి శ్యామ్‌స్రసాద్‌, ఉపాధ్యక్షుడు స్వామి, సభ్యులు రాజు, శ్రీకాంత్‌, హనుమాన్‌దాస్‌, రాంబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement