సిద్దిపేటజోన్: సిద్దిపేట తొలి ఎమ్మెల్యే ఎడ్ల గురువారెడ్డి జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిదారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్కులో గురువారెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడిగా గురువారెడ్డిని అభివర్ణించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని పొగిడారు. ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ఆయన రాజకీయ జీవితాన్ని అంకితం చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో ఆ యన చేసిన త్యాగాలు, పోరాటం, ప్రజా సేవ గురించి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్, జిల్లా సీపీఐ కార్యదర్శి పవన్, తెలంగాణ విద్యా వంతుల వేదిక అధ్యక్షుడు పాప య్య, జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ
అవార్డు గ్రహీత సిదారెడ్డి


