హుస్నాబాద్ ఏసీపీ సదానందం
అక్కన్నపేట(హుస్నాబాద్): ఈ నెల 20వ తేదీన జరగనున్న లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం అన్నారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు, పెండింగ్ కేసులు, స్టేషన్ నిర్వహణ తరతర అంశాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజీమార్గం ద్వారా పరిష్కరించగల కేసుల వివరాల జాబితాను సిద్ధం చేసి వెంటనే పంపించాలని సూచించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా స్పందించాలని కోరారు. పోలీస్ మెట్లు ఎక్కే ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ చాతరాజు ప్రశాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


