సర్పంచ్‌లకు తీపి కబురు | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లకు తీపి కబురు

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

దుబ్బాక: సర్పంచ్‌లకు శుభవార్త. ఆరు నెలలుగా వేతనాల కోసం ఎదురుచూస్తున్న సర్పంచ్‌లకు ప్రభుత్వం గౌరవ వేతనాలు మంజూరు చేసింది. గెలిచి ఆరు నెలలవుతున్నా వేతనాలు రాకపోవడంతో సర్పంచ్‌లు నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా ఐదు నెలల పదిరోజులకు సంబంధించిన గౌరవ వేతనాలు విడుదల చేసింది. ఎట్టకేలకు గౌరవ వేతనాలు రావడంతో సర్పంచ్‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

508 సర్పంచ్‌లకు..

సిద్దిపేట జిల్లాలో 508 గ్రామపంచాయతీలు ఉన్నాయి. రెండు సంవత్సరాలకు పైగా ఎన్నికలు జరగక ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీలు ఉన్నాయి. 2025 డిసెంబర్‌ 20న గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలిచి నూతన సర్పంచ్‌లుగా బాధ్యతలు చేపట్టారు. సర్పంచ్‌లకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.6,500 గౌరవ వేతనం ఇస్తుంది. తాజాగా ప్రభుత్వం 5 నెలల 10 రోజులకు గాను రూ.1.75 కోట్లు విడుదల చేసింది. గౌరవ వేతనాలను సర్పంచ్‌ల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఐదు నెలల వేతనాలు మంజూరు

రూ.1.75 కోట్లు విడుదల

సంతోషం వ్యక్తం చేస్తున్న సర్పంచ్‌లు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement