టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్‌) సిద్దిపేట జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీధర్‌, నర్సిరెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో తపస్‌ ఆధ్వర్యంలో డిసి్‌ట్రక్ట్‌ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నిర్వహించడం సరికాదని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. రాష్ట్రంలో 30వేల మంది ఉపాధ్యాయులు విధిగా టెట్‌ అర్హత సాధించాల్సి ఉందన్నారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు టెట్‌కు ప్రిపేర్‌ అవ్వడం సాధ్యం కాదని తెలిపారు. విద్యాహక్కు చట్టంలో 2010కి ముందు ఉపాధ్యాయులుగా నియామకమైన వారికి టెట్‌ అర్హత అవసరం లేదని ఉందన్నారు. 2028 ఆగస్టు 31లోగా ఉపాధ్యాయులు టెట్‌ అర్హత సాధించాలని, సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో తపస్‌ నాయకులు జనార్దన్‌, శివకుమార్‌, మల్లేశం, శ్రీకాంత్‌, మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

తపస్‌ జిల్లా అధ్యక్షుడు మురళీధర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement