సకల సదుపాయాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

సకల సదుపాయాలు కల్పించాలి

Jun 14 2026 10:13 AM | Updated on Jun 14 2026 10:13 AM

మర్కూక్‌(గజ్వేల్‌): తెలంగాణ పబ్లిక్‌ పాఠశాల ప్రారంభానికి సర్వం సిద్ధం చేయాలని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హైమావతి ఆదేశించారు. మర్కూక్‌ మండల కేంద్రంలోని తెలంగాణ పబ్లిక్‌ పాఠశాలను శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రీ ప్రైమరీకి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. విద్యార్థులకు భోజన వసతి, మంచినీరు, విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శాసీ్త్ర, ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌రెడ్డి, మండల విధ్యాధికారి ఉదయ్‌ భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తొద్దు

కలెక్టర్‌ హైమావతి ఆదేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement