సిద్దిపేటరూరల్: విద్యార్థులు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన పొందుతూ ముందుకు సాగాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రతి విద్యార్థి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి పద్మజారాణి, అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ హైమావతి
ప్రతిభ చాటిన విద్యార్థులకుబహుమతుల ప్రదానం


