జ్యూట్‌ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహిద్దాం | - | Sakshi
Sakshi News home page

జ్యూట్‌ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహిద్దాం

Jun 13 2026 1:23 PM | Updated on Jun 13 2026 1:23 PM

సిద్దిపేటజోన్‌: జ్యూట్‌ బ్యాగుల వాడకాన్ని ప్రోత్సహిద్దామని, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధంతో పర్యావరణ పరిరక్షణకు దోహదపడుదామని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్‌, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు రవీందర్‌లు అన్నారు. శుక్రవారం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లో జ్యూట్‌ బ్యాగ్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్లాస్టిక్‌ వాడకం, దాని పర్యావసానంపై వివరించారు. జ్యూట్‌ బ్యాగ్స్‌ వాడాలని సూచించారు. స్టీల్‌ పాత్రలను వినియోగించుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో వ్యాపారులు, ప్రజలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement