మార్మోగిన మల్లన్న ఆలయం | - | Sakshi
Sakshi News home page

మార్మోగిన మల్లన్న ఆలయం

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

మార్మోగిన మల్లన్న ఆలయం

కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తుల రాకతో సందడిగా మారింది. దీంతో ఆలయ పరిసరాలు మల్లన్న నామస్మరణతో మారుమోగాయి. శనివారం సాయంత్రమే క్షేత్రానికి చేరుకున్న భక్తులు ఆలయ, ప్రయివేటు వసతి గదులలో బసచేశారు. వేకువజామునే పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. కొంత మంది గంగిరేణి చెట్టు వద్ద పట్నాలు వేసి, ముడు పులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. కొందరు స్తంభం వద్ద కోడెలను కట్టారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.

కొమురవెల్లిలో భక్తుల సందడి

Advertisement
 
Advertisement
Advertisement