ప్యాడీ క్లీనర్లకు తుప్పు.. ఎవరిదీ తప్పు | - | Sakshi
Sakshi News home page

ప్యాడీ క్లీనర్లకు తుప్పు.. ఎవరిదీ తప్పు

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

తుప్పు పట్టిన ప్యాడీ క్లీనర్లు

ప్యాడీ క్లీనర్ల యంత్రాలపై నిర్లక్ష్యపు గ్రహణం ఆవహించింది. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో చెత్తా చెదారాన్ని వేరు చేసి శుభ్రం చేయడానికి వినియోగించే ప్యాడీ క్లీనర్లపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో నెలల తరబడి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయి. మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని ఏఎంసీ గోదాం వద్ద సుమారు 15 ప్యాడీ క్లీనర్లు తుప్పుపట్టి ఉన్నాయి. వాటిపై పర్యవేక్షణ లోపించడంతో ప్రజాధనం వృథాగా మారుతోందని రైతులు మండిపడుతున్నారు. – మిరుదొడ్డి(దుబ్బాక)

Advertisement
 
Advertisement
Advertisement