వడగళ్ల వాన.. రైతన్న హైరానా | - | Sakshi
Sakshi News home page

వడగళ్ల వాన.. రైతన్న హైరానా

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 ● పలు ప్రాంతాల్లో తడిసిన వరి ధాన్యం ● నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు ● నిలిచిన విద్యుత్‌ సరఫరా ● ఇబ్బందులు పడిన ప్రజలు

న్యూస్‌రీల్‌

శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026
● పలు ప్రాంతాల్లో తడిసిన వరి ధాన్యం ● నేలకూలిన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు ● నిలిచిన విద్యుత్‌ సరఫరా ● ఇబ్బందులు పడిన ప్రజలు

జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వర్షం దంచికొట్టింది. కొద్ది రోజులుగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో సతమతమైన ప్రజలకు కాస్త ఉపశమనం లభించినా రైతులకు నష్టాన్ని కలిగించింది. అకాల వర్షానికి సిద్దిపేట పత్తి మార్కెట్‌ యార్డులో ధాన్యం తడిసిపోయింది. అలాగే ఆరుబయట ఉన్న ధాన్యం రాశులు తడవకుండా అన్నదాతలు శ్రమించారు. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. దీంతో జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6.30గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పొన్నాల, బక్రిచెప్యాల, నాంచారుపల్లి, ఎన్సాన్‌పల్లి, కృష్ణసాగర్‌లో ఆరబోసిన వరి ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో పాటు చేనులోని వరి గింజలు నేలరాలాయి. తడిసిన వరి ధాన్యాన్ని సిద్దిపేట అర్బన్‌ మండల వ్యవసాయధికారి శ్రీనాథ్‌ పరిశీలించారు.

– ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)/సిద్దిపేటఅర్బన్‌/

సిద్దిపేటజోన్‌

Advertisement
 
Advertisement
Advertisement