డివిజన్ సాధించే వరకు ఉద్యమిస్తాం
చేర్యాల(సిద్దిపేట): చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించే వరకు ఉద్యమిస్తామని స్థానిక బార్ అసో సియేషన్ అధ్యక్షుడు ఆరెళ్ల వీరమల్లయ్య అన్నారు. చేర్యాలలో కోర్టు ఏర్పాటై యేడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం న్యాయవాదులు కలిసి కేక్ కట్‌చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చర్చ జరుగుతున్న తరుణంలో మౌనంగా ఉంటే గతంలో జరిగిన అన్యాయమే జరుగుతుందన్నారు. గతంలోఅన్ని అర్హతలున్న చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయలేదన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో చూపిన పోరాట పటిమతో మరోసారి ప్రజల మద్యకు వచ్చి అన్ని వర్గాల మద్దతుతో చేర్యాలను రెవెన్యూ డివిజన్ ప్రకటించేలా ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు మనోహర్, యాదగిరి, మహేందర్, సురేందర్, రమేష్, ప్రణీత్, వెంకటేశ్, సురేష్, సంతోష్ పాల్గొన్నారు.


