సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టొద్దు
● ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్‌బక్కి వెంకటయ్య
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టొద్దని, అలా జరిగితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ల్యాండ్, అట్రాసిటి కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా బక్కి వెంకటయ్య హాజరై మాట్లాడారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా పనిచేసి పేద ప్రజలకు న్యాయం చేయాలన్నారు.


