పీఎంశ్రీపై నిర్లక్ష్యం తగదు: డీఈఓ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పీఎంశ్రీ పథకంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ప్రధానోపాధ్యాయులను హెచ్చరించారు. పథకంలో భాగంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకలు, స్పోర్ట్స్ మీట్‌లకు సంబంధించి బిల్లులను బుధవారం అందజేయాలని హెచ్‌ఎంలను ఆదేశించారు. ‘పీఎంశ్రీపై నిర్లక్ష్యం.. నెరవేరని లక్ష్యం’ పేరుతో సాక్షిలో మంగళవారం కథనం ప్రచురితమైంది. దీంతో డీఈఓ స్పందించి సంబంధిత హెచ్‌ఎంలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. స్పోర్ట్స్ మీట్‌కు సంబంధించి మోడల్ స్కూల్ ఇర్కోడ్, హుస్నాబాద్, మద్దూరు, చేర్యాల (ముస్త్యాల), టీఎస్‌డబ్ల్యూఈఐఎస్ కోహెడ, జిల్లెలగడ్డ.. అలాగే బతుకమ్మకు సంబంఽధించి మోడల్ స్కూల్ ఇర్కోడ్, ఇబ్రహీంనగర్, కోహెడ, అక్కెనపల్లి, మద్దూరు, చేర్యాల హెచ్‌ఎంలు అందించాలని ఆదేశించారు. బతుకమ్మ పండుగ వేడుకకు సంబంధించి ఎక్కువగా ఖర్చు చేయకుండా సాదాసీదాగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఆ డబ్బులు డ్రా చేసేందుకు బిల్లుల కోసం హెచ్‌ఎంలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎఫెక్ట్


