హామీలను అమలు చేయాలి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేటలోని కేసీఆర్‌నగర్ డబుల్‌బెడ్ రూం కాలనీ ప్రభుత్వ పాఠశాలలో టీపీటీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జూలై 2023 నుంచి రావాల్సిన వేతన సవరణను వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు వర్తింప చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, సిద్దిపేట అర్బన్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్, నాయకులు మల్లేశం, సలీం, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
టీపీటీఎఫ్ అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి


