విద్యార్థిని మరణంపైవిచారణ జరిపించాలి
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మరణించిన విద్యార్థిని ఘటనపై ఉన్నతాఽధికారులు సమగ్ర విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అభిషేక్ భాను, రంజిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మిట్టపల్లి కేజీబీవీ విద్యార్థిని అనుమాస్పదంగా మరణించిందన్నారు. అందువల్ల కలెక్టర్ స్పందించి వెంటనే విచారణ జరిపించి, నిందుతులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు పాల్గొన్నారు.


