
కమనీయం.. గోవిందుడి కల్యాణం
బుధవారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2025
హాజరైన చినజీయర్ స్వామి ● గోవింద నామస్మరణతో మార్మోగిన జిల్లా కేంద్రం
భక్తుల జయజయధ్వానాల మధ్య గోవిందుడి కల్యాణం అత్యంత కమనీయంగా సాగింది. జిల్లా కేంద్రంలోని మోహినిపుర వేంకటేశ్వర స్వామి ఆలయ స్వర్ణోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఆలయ ఆవరణలో పద్మావతి భూనీళా సమేత శ్రీనివాసుల కల్యాణాన్ని త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ రఘునందన్‌రావు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. స్వామివారి కల్యాణం అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు. సాయంత్రం వేళ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో సామూహిక లక్ష్మీనారాయణ ఆరాధన కార్యక్రమం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై భజనలు, భక్తిగీతాలు ఆలపించారు. దీంతో జిల్లా కేంద్రం గోవిందా నామస్మరణతో మార్మోగింది.
నేడు రథోత్సవం...
మోహినిపుర వేంకటేశ్వర ఆలయ స్వర్ణోత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం తీర్థ గోష్టి జరుగనుంది. అనంతరం సుదర్శన నారసింహ ఇష్టి, సాయంత్రం పట్టణ పురవీధుల్లో శ్రీవారి రథోత్సవం నిర్వహిస్తారు.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)
న్యూస్‌రీల్

కమనీయం.. గోవిందుడి కల్యాణం