
రుతు పరిశుభ్రతతోనే ఆరోగ్యం
● మెన్‌స్ట్రువల్ కప్స్‌తో ఎంతో మేలు ● అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
హుస్నాబాద్: మెన్‌స్ట్రువల్ కప్స్ వాడటం వల్ల మహిళలు ఆరోగ్యంగా ఉంటారని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. పట్టణంలోని తిరుమల గార్డెన్‌లో పట్టణ మహిళా సంఘాల సభ్యులకు ఋతు ప్రేమపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా గరీమా అగర్వాల్ హాజరై మాట్లాడారు. మహిళలు నెలసరి క్రమంలో ఉపయోగించే ప్యాడ్స్ వల్ల అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయని తెలిపారు. ప్యాడ్స్‌తో పర్యావరణం కలుషితం అవుతుందన్నారు. మెన్‌స్ట్రువల్ కప్స్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదదన్నారు. ఒక కప్పు పదేళ్ల వరకు పని చేస్తుందన్నారు. ఈ సందర్భంగా 1000 కప్పులను మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీపీఓ దేవకి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, సీడీపీఓ జయమ్మ, మెడికల్ ఆఫీసర్ మైమూన్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఆకుల రజిత, మాజీ కౌన్సిలర్ నళిని దేవి, మెప్మా ఏడీఎంఎస్ సంతోషి, ఆర్పీలు, అంగన్‌వాడి టీచర్లు పాల్గొన్నారు.