
లోక్‌అదాలత్‌లో అధిక కేసులు పరిష్కరిద్దాం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి
● సిద్దిపేట కోర్టులో పోలీసు, ఎకై ్సజ్,
రెవెన్యూ అధికారులతో సమావేశం
సిద్దిపేటకమాన్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వచ్చే నెల 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సూచించారు. జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో పోలీసు, ఎకై ్సజ్, రెవెన్యూ అధికారులతో న్యాయమూర్తి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ క్రిమినల్, సివిల్, ఎకై ్సజ్, మోటారు వాహనాల కేసులు అధిక మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జూన్ 9నుంచి 14వరకు స్పెషల్ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జయప్రసాద్, మిలింద్‌కాంబ్లే, సంతోష్‌కుమార్, తరణి, న్యాయ సిబ్బంది పాల్గొన్నారు.