వైద్య వృత్తి మహోన్నతమైనది
జ్యోతిప్రజ్వలన చేస్తున్న మంత్రి పొన్నం
సిద్దిపేటఅర్బన్: వైద్య వృత్తి మహోన్నతమైనదని, వృత్తిలో రాణించి తల్లిదండ్రులకు, సమాజానికి గొప్ప పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం సురభి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మొదటి స్నాతకోత్సవ వేడుకలకు మంత్రితో పాటు ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే హరీష్‌రావు, యూనివర్సిటీ వీసీ నందా కుమార్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనబడే దేవుళ్లు డాక్టర్లేనని అన్నారు. గతంలో మెడికల్ కాలేజీలు తక్కువగా ఉండేవని తెలంగాణ వచ్చాక చాలా కాలేజీలు వచ్చాయన్నారు. నేటి విద్యార్థులు డాక్టర్లు అవ్వాలని, తల్లిదండ్రుల కోరిక నెరవేర్చడంతో పాటు సామాజిక బాధ్యతతో వైద్యం అందించాలని అన్నారు. డాక్టర్లుగా వెళ్తున్న 2019 బ్యాచ్ విద్యార్థులు మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సురభి మెడికల్ కాలేజీ చైర్మన్ హరిందరావు, మహేందర్ రావు, మనోహర్ రావు, డీన్ రఫీ, మెడికల్ డైరెక్టర్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సురభి స్నాతకోత్సవంలో మంత్రి పొన్నం
వైద్య వృత్తి మహోన్నతమైనది


