అభివృద్ధిలో కార్యదర్శులదే కీలక పాత్ర
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
హుస్నాబాద్‌రూరల్: అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శులు పల్లె సోల్జర్స్‌గా నిలవాలని అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) శుభం గార్డెన్‌లో అక్కన్నపేట, కోహెడ, హుస్నాబాద్ మండలాల పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, సీఏలకు యుడీఐడీ పై అవగాహన సదస్సు నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ చేయూత, సదరం పింఛన్ల కోసం వృద్ధులను ఇబ్బందులు పెట్టవద్దన్నారు. సదరం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లకుండానే మన ఇంటి నుంచే యుడీఐడీలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు దీనిపై అవగాహన కల్పించాలని వివరించాలన్నారు.


