చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం
దుబ్బాక డబుల్ బెడ్రూంల వ్యూ
అసంపూర్తిగా
డబుల్ బెడ్రూంల నిర్మాణాలు
● పనులు పూర్తికాకుండానే
అధిక పేమెంట్
● అధికారుల పర్యవేక్షణ లోపం
● కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
● దుబ్బాక పట్టణంలో
పేదల ఇళ్ల దుస్థితి
దక్కించుకున్న పనులు పూర్తయి నెలలు గడిచినా ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడం చూశాం.. కానీ ఇక్కడ మాత్రం సీన్ రీవర్స్.. కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్ పేమెంట్ల పేరుతో అధికారులు ఇష్టారాజ్యంగా చెల్లించారు. ఓ వైపు పనులు వంద శాతం పూర్తికాకున్నా.. చెల్లించాల్సిన వాటి కంటే ఎక్కువే పేమెంట్ చేశారు. దుబ్బాక పట్టణంలో 948 డబుల్ బెడ్రూంల నిర్మాణాలను రెండు ఏజెన్సీలకు అప్పగించారు. అందులో 876 డబుల్ బెడ్రూంల నిర్మాణాలు జరగగా అందులో పది శాతం వరకు మైనర్ పనులు మిగిలే ఉన్నాయి. రెండేళ్ల కిత్రం పేమెంట్లు పూర్తి చేసినా సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకపోవడం గమనార్హం.
రూ. 5.30లక్షల చొప్పున..
ఒక్కో డబుల్ బెడ్రూం నిర్మాణానికి రూ.5.30లక్షల చొప్పున చెల్లిస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. ఆ డబ్బులు సరిపోవని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అధికారులు అడ్వాన్స్ పేమెంట్లు చేయించి నిర్మాణాలు ప్రారంభించారు. 948 డబుల్ బెడ్రూంల నిర్మాణాలను సదరు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. కొంత స్థలం తక్కువగా ఉండటంతో 876 డబుల్ బెడ్రూంల పనులు ప్రారంభించారు. వీటి నిర్మాణాలకు రూ.46,42,80,000 అవుతుంది. అయితే రెండేళ్ల కిత్రం రూ.46,47,22,256 చెల్లించారు. ఒక వైపు వంద శాతం పనులు పూర్తి కానప్పటికీ రూ.4,42,256 అధికంగా చెల్లించారు. నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతోనే అధికంగా చెల్లింపులు జరిగాయని తెలుస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి డబుల్ బెడ్రూంలలో పెండింగ్‌లో ఉన్న మైనర్ పనులు పూర్తి చేసి అర్హులకు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
సాక్షి, సిద్దిపేట: దుబ్బాక పట్టణం బల్వంతపూర్ రోడ్‌లో మోడల్ కాలనీగా 2017లో జీ ప్లస్ టూ తో డబుల్ బెడ్రూంల నిర్మాణాలను ప్రారంభించారు. వెయ్యి డబుల్ బెడ్రూంలు మంజూరు కాగా 948 నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. అందులో బల్వంతపూర్ రోడ్‌లో జీ ప్లస్ టూతో ఒక్కో బ్లాక్‌లో 12 చొప్పున 66 బ్లాక్‌లు, మల్లయిపల్లి రోడ్‌లో ఏడు బ్లాక్‌లు ఇలా మొత్తంగా 876 డబూల్ బెడ్రూంల నిర్మాణాలు జరిగాయి. వీటిలో 588 డబుల్ బెడ్రూంలను లబ్ధిదారులకు అందించారు. ఇంకా 288 డబుల్ బెడ్రూంలలో పలు మైనర్ పనులు మిగిలిపోయాయి. డోర్లు, కిటికీలు, పెయింటింగ్, మరుగుదొడ్లు, కరెంట్ వైరింగ్ పనులు మిగిలిపోయాయి. మిగిలిన వాటికి లబ్ధిదారుల పేర్లను పూర్తి స్థాయిలో ప్రకటించలేదు. దీంతో నిరుపేదలు ఇంటి అద్దెను చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎక్కువ పేమెంట్ జరగలేదు
దుబ్బాకలో నిర్మించిన డబుల్ బెడ్రూంల విషయమై కాంట్రాక్టర్‌కు ఎక్కువ పేమెంట్ చేయలేదు. రికార్డ్ చేసిన విధంగా బిల్లులను అందించాం. బెడ్రూంలలో అసంపూర్తిగా పనులు ఉంటే పరిశీలించి చేయిస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి,
ఇన్‌చార్జ్ ఈఈ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్
చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం
చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం
చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం
చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం
చెల్లింపులు అధికం.. సమస్యలు అనేకం


