జగ్జీవన్‌రాంకు ఘన నివాళి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబుజగ్జీవన్‌రాం 118వ జయంతి ఉత్సవాలను సిద్దిపేటలో శనివారం ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తాలోని జగ్జీవన్‌రాం విగ్రహానికి జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సుభాష్ చంద్రబోస్, అధికారులు, కాంగ్రెస్, బీజేపీ, ఉపాధ్యాయ, కులసంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకు ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. జగ్జీవన్ ఆశయాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఎస్సీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారి హమీద్, పెర్క పర్శరాములు, లింగంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
దళిత సంఘాల నాయకుల నిరసన
డాక్టర్ బాబు జగ్జీవన్ రాం జయంతి ఉత్సవాలలో సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, ఇతర జిల్లా స్థా యి నాయకులు పాల్గొనలేదని దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు.


