నీరివ్వకుంటే ఉద్యమమే..
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరిక ● కుంటలు, చెరువులు, సాగునీటి కాల్వల పరిశీలన
దుబ్బాక: ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో దుబ్బాక నియోజకవర్గం సర్వం కోల్పోయింది. ముందుగా ప్రాజెక్టు నుంచి నీరు మాకు ఇవ్వాలి.. లేకుంటే హైదరాబాద్‌కు వెళ్లే నీటిని అడ్డుకుంటామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం రైతులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి దుబ్బాక, పెద్దగుండవెల్లి గ్రామాల్లో కుంటలు, చెరువులు, సాగునీటి కాల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులు, ప్రధాన కాల్వలు నిర్మిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాల్వలను కూడా నిర్మించడం లేదని విమర్శించారు. ఏడాది కాలంగా మల్లన్నసాగర్ ఉపకాల్వల నిర్మాణం చేపట్టి పంటలకు నీరందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్వల నిర్మాణం లేకపోవడంతో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే కాల్వల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. సన్నబియ్యం అంటూ కొబ్బరికాయలు కొడుతున్న కాంగ్రెస్ నాయకులకు రైతుల బాధలు పట్టవా అని ప్రశ్నించారు.
రైతే దేశానికి వెన్నెముక
దౌల్తాబాద్ (దుబ్బాక): అన్నం పెట్టే రైతును నిర్లక్ష్యం చేస్తే దేశం వెనుకబాటు తనానికి కారణమవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండల పరిధి గాజులపల్లిలోని పటేల్ చెరువు కాలువ నుంచి మల్లన్న సాగర్‌జలాలు విడుదల చేశారు ఈ మేరకు ఎమ్మెల్యే పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


