సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి
సిద్దిపేటఅర్బన్: పభుత్వ భూములను ఆక్రమించుకున్న రామోజీ గ్రూపు యాజమాన్యంపై కేసులు నమోదు చేయాలని పోరాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో పాటు రంగారెడ్డి జిల్లా నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సిద్దిపేటలోని కార్మిక, కర్షక భవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల క్రితం ఇళ్లు లేని పేదలకు ప్రభుత్వం స్థలాలను కేటాయిస్తే ఆ స్థలాలను రామోజీ యాజమాన్యం ఆక్రమించి పట్టాలున్న పేదలను స్థలంలోకి రాకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం రామోజీ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు గోపాలస్వామి, శశిధర్ పాల్గొన్నారు.


