‘మిషన్ భగీరథ’కు పట్టినిల్లు అయిన గజ్వేల్‌లోనే మంచినీళ్ల కష్టాలు మొదలయ్యాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి గడపకు నల్లా ద్వారా మంచినీటిని అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని చేపట్టింది. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ప్రధాని మోదీ 2016 ఆగస్టు 7న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కానీ నేడు ఈ ప్రాంతానికి సరిపడా నీటి సరఫరా జరగకపోవడంతో నీటి కష్టాలు తప్పడంలేదు.
● ‘మిషన్ భగీరఽథ’కు అంకురార్పణ జరిగిన చోటే తగ్గిన నీటి సరఫరా
● రోజువారీ వినియోగం 70ఎంఎల్‌డీ పైనే..
● సరఫరా అవుతోంది... 60లోపే
● రాబోవు రోజుల్లో కొరత తీవ్రమయ్యే అవకాశం
● మల్లన్నసాగర్ పైపులైన్ పూర్తయితే సమస్యకు పరిష్కారం
మల్లన్నసాగర్ జలాశయం నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. మల్లన్నసాగర్ నుంచి వచ్చే జలాలు కొండపాక మండలం మంగోల్ డబ్ల్యూటీపీ (వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లో శుద్ధి జరిగి అక్కడి నుంచి సరఫరా అవుతాయి. ఇక్కడి నుంచి లకుడారం వద్ద నిర్మించిన జీఎల్‌బీ (గ్రౌండ్ లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్)కి వస్తాయి. ఇక్కడి నుంచి ప్రస్తుతం సిద్దిపేట, జనగామ జిల్లాలకు ప్రత్యేక లైన్ ద్వారా ఇప్పటికే నీటి సరఫరా జరుగుతోంది. ఇక్కడి నుంచి రూ.210కోట్ల వ్యయంతో 16కిలోమీటర్ల పొడవున గజ్వేల్ మండలం అక్కారం సంపు వరకు లైన్ నిర్మాణం జరుగుతోంది. మరో నెల రోజుల్లో ఈ పనులు పూర్తయితే హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ నుంచి నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి తప్పనుంది. అక్కారం సంపు నుంచి కోమటిబండ మిషన్ హెడ్‌వర్క్స్‌కు గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు సరిపడనంతగా నీరు రానుంది.
మల్లన్నసాగర్ లైన్ పూర్తయితేనే..
గజ్వేల్: ‘మిషన్ భగీరథ’ పథకం దేశం దృష్టిని ఆకర్షించింది. గతంలో సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో కేసీఆర్.. మానేరు ద్వారా సిద్దిపేటకు వాటర్‌గ్రిడ్ తరహాలో అందించిన నీటి పథకం తీరును పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ‘మిషన్ భగీరథ’కు శ్రీకారం చుట్టారు. తొలి ఫలాలను గజ్వేల్ అందుకుంది. కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా 2015 జూన్ 2న గజ్వేల్ వాటర్‌గ్రిడ్‌కు (గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలు) రూ.1,055కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌కు గోదావరి జలాలను తరలించే పైప్‌లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేసి ఈ ప్రాంతానికి అందిస్తున్నారు. ఇందులో భాగంగానే కొండపాకలోని హెచ్‌ఎండబ్ల్యూఎస్ (హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్)ప్రాంగణం నుంచి, ప్రజ్ఞాపూర్ వద్ద పైప్‌లైన్ నుంచి నీటిని ట్యాపింగ్ చేస్తున్నారు. ప్రజ్ఞాపూర్ నుంచి పైప్‌లైన్‌ను ట్యాపింగ్ చేసి ఆ నీటిని ఎత్తయిన ప్రదేశంలో ఉన్న గజ్వేల్ మండలం కోమటిబండ అటవీ ప్రాంతంలోని సంప్‌హౌస్‌కు తరలించి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలోని 244 హాబిటేషన్లలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని కలుపుకుని మరో 65 గ్రామాలకు నీటి సరఫరా చేస్తున్నారు.
దుబ్బాకకు సైతం ఇక్కడి నుంచే..
దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, చేగుంట, దౌల్తాబాద్ మండలాల్లోని 213 గ్రామాలకూ ఇక్కడి నుంచే మంచినీటి సరఫరా జరుగుతోంది.
సరఫరా 60ఎంఎల్‌డీలోపే..
ప్రస్తుతం కోమటిబండలోని ‘మిషన్ భగీరథ’ హెడ్‌వర్క్స్‌నుంచి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు రోజువారీగా 70ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 60ఎంఎల్‌డీలోపే సరఫరా అవుతోంది. ట్యాపింగ్ పాయింట్ నుంచి ఇంతే నీరు వస్తుండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి నిత్యం 8ఎంఎల్‌డీ నీరు రావాల్సి ఉండగా.. 5ఎంఎల్‌డీ మాత్రమే వస్తున్నాయని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో నీరు సరిపోక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు.
త్వరలోనే పైపులైన్ పూర్తిచేస్తాం
మల్లన్నసాగర్ నుంచి వచ్చే పైప్‌లైన్ నిర్మాణం పూర్తయితే గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు ఇక ఇబ్బంది ఉండదు. త్వరలోనే ఈ పనులు పూర్తిచేసి హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ ట్యాపింగ్ మూసేస్తాం. ప్రస్తుతానికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రయత్నిస్తున్నాం.
–శ్రీనివాస్,
ఈఈ, గజ్వేల్ మిషన్ భగీరథ
ఈనెల 21న మున్సిపాలిటీ పరిధిలోని 3, 4, 15, 16 వార్డులకు చెందిన ప్రజలు కమిషనర్ గొల్కొండ నర్సయ్యకు మంచినీటి సమస్యపై వినతి పత్రం ఇచ్చిన సంగతి కూడా తెల్సిందే. నియోజకవర్గంలోని తూప్రాన్ మున్సిపాలిటీకి నిత్యం 6.3 ఎంఎల్‌డీ నీరు రావాల్సి ఉంది. అయితే 5.5ఎంఎల్‌డీ మాత్రమే వస్తుండటంతో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాల్సిన దుస్థితి నెలకొన్నది. కొండపాక మండలం లకుడారం గ్రామంలోనూ పైప్‌లైన్ సమస్య వల్ల నాలుగైదు రోజులపాటు మంచినీటి సరఫరా నిలిచిపోయింది. తర్వాత పునరుద్ధరించారు.
కమిషనర్‌కు వినతి..
గజ్వేల్‌లో నీటి కష్టాలు
గజ్వేల్‌లో నీటి కష్టాలు
గజ్వేల్‌లో నీటి కష్టాలు
గజ్వేల్‌లో నీటి కష్టాలు
గజ్వేల్‌లో నీటి కష్టాలు


