రాజగోపాల్‌పేటకు రాష్ట్రస్థాయి బహుమతి | - | Sakshi
Sakshi News home page

రాజగోపాల్‌పేటకు రాష్ట్రస్థాయి బహుమతి

Mar 20 2025 7:58 AM | Updated on Mar 20 2025 7:59 AM

నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్‌ కళాశాలల రాష్ట్రస్థాయి సృజన టెక్‌ఫెస్ట్‌ 2025 పోటీలో రాజగోపాల్‌పేట కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించారు. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన పోటీలలో కళాశాల నుంచి విద్యార్థి చంద్రశేఖర్‌ బృందం ‘అత్యవస ర వాహనాల కోసం ఇంటెలిజెన్స్‌ ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థ’ ఐఓటీ ఆధారిత మొబైల్‌ యాఫ్‌ను ఆవిష్కరించారు. అధ్యాపకుడు రాజమౌళి పర్యవేక్షణలో చేపట్టిన ఈ ప్రయోగానికి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. ఈ సందర్భంగా ఆ విద్యార్థులు చంద్రశేఖర్‌, కావ్య, జ్యోత్స్న, ప్రకర్ణ, రితేశ్‌, ముదాసీర్‌ను ప్రిన్సిపాల్‌ గోవర్ధన్‌, అధ్యాపకులు రాజు, అభినవ్‌, రాజేశ్‌ తదితరులు అభినందించారు.

నూతన డీఎంగా వెంకన్న

హుస్నాబాద్‌: హుస్నాబాద్‌ ఆర్టీసీ డిపో డీఎంగా ఎన్‌.వెంకన్న బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీఎంగా పనిచేసిన వెంకటేశ్వర్లు కాచిగూడ డిపోకు బదిలీపై వెళ్లారు. అనంతరం డిపోలో ఎన్‌.వెంకన్న ఆధ్వర్యంలో జనవరి, ఫిబ్రవరి 2025కు గాను ఉద్యోగులకు ప్రగతిచక్ర అవార్డులను ప్రదానం చేశారు. అలాగే బెస్ట్‌ ఈపీకే, బెస్ట్‌ కేఎంపీఎల్‌ క్యాష్‌ అవార్డులను అందజేశారు.

గేట్‌ ఫలితాల్లో

సత్తా చాటిన రైతుబిడ్డ

చిన్నకోడూరు(సిద్దిపేట): గేట్‌ ఫలితాల్లో సింగిరెడ్డి శ్రావణ్‌రెడ్డి ఆల్‌ ఇండియా 807వ ర్యాంకు సాధించాడు. మండల పరిధిలోని మాచాపూర్‌కు చెందిన సింగిరెడ్డి నిర్మల, ఆదిరెడ్డి దంపతుల రెండో కుమారుడు శ్రావణ్‌రెడ్డి. వారిది సాధారణ రైతు కుటుంబం కావడంతో మొదటి నుంచి ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే విద్యనభ్యసించాడు. బుధవారం వెలువడిన గేట్‌ ఫలితాల్లో ఈసీ బ్రాంచ్‌లో 807వ ర్యాంకు సాధించాడు. దీంతో మిత్రులు, గ్రామస్తులు శ్రావణ్‌ను అభినందించారు.

రాజరాజేశ్వర..

అందుకో పుష్పార్చన

దుబ్బాక: అక్బర్‌పేట–భూంపల్లి మండలంలోని చౌదర్‌పల్లిలోని పార్వతీ సహిత దుబ్బరాజేశ్వరస్వామి ఆలయంలో బుధవారం మూడు లక్షల పుష్పాలతో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా హరహర మహాదేవ నామస్మరణతో ఆలయం మారుమోగింది.

నేడు జిల్లా స్థాయి

యూత్‌ పార్లమెంట్‌

సిద్దిపేట ఎడ్యుకేషన్‌: జిల్లా స్థాయి వికసిత్‌ భారత్‌ యూత్‌ పార్లమెంట్‌ ఫెస్టివల్‌ను సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్‌ కళాశాలలో నిర్వహించనున్నట్లు కార్యక్రమ నోడల్‌ ఆఫీసర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సునీత, కోఆర్డినేటర్‌ డా.శ్రద్ధానందం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మేడ్చల్‌, జనగామ, సిద్ది పేట జిల్లాలకు సంబంధించిన ఫెస్టివల్‌ ఇక్కడ జరగనున్నట్లు తెలిపారు. 150 మందిని ఎంపిక చేశామని, అలాగే 20, 21న జిల్లాస్థాయి ఎంపిక కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

రాజగోపాల్‌పేటకు  రాష్ట్రస్థాయి బహుమతి 
1
1/3

రాజగోపాల్‌పేటకు రాష్ట్రస్థాయి బహుమతి

రాజగోపాల్‌పేటకు  రాష్ట్రస్థాయి బహుమతి 
2
2/3

రాజగోపాల్‌పేటకు రాష్ట్రస్థాయి బహుమతి

రాజగోపాల్‌పేటకు  రాష్ట్రస్థాయి బహుమతి 
3
3/3

రాజగోపాల్‌పేటకు రాష్ట్రస్థాయి బహుమతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement