పెద్దశంకరంపేట(మెదక్): రైతులకు నాణ్యమైన 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం పెద్దశంకరంపేటలో రైతులు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రైతులు పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అనంతరం రైతులతో కలిసి స్థానిక సబ్‌స్టేషన్ ఏఈ శ్యాంసుందర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, బీఆర్‌ఎస్ నాయకులు సురేశ్‌గౌడ్, లింగయ్య, రమేశ్, దత్తు, సుభాశ్, శంకర్‌గౌడ్, యాదుల్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.


