ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సాహిత్యరంగంలో సిద్ధప్ప చేసిన సేవలు ఎనలేనివని, ఆయన సాహిత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, సామాజిక కార్యకర్త రాదారి నాగరాజు అన్నారు. శాలివాహన ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వరకవి సిద్దప్ప 123వ జయంతి ఉత్సవాలను గురువారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ ఆయన అందించిన సాహిత్యం, చూపిన మార్గం నేటి సమాజానికి ఎంతో ఆదర్శవంతంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు దరిపల్లి నగేశ్, ప్రధాన కార్యదర్శి గర్నేపల్లి ఆంజనేయులు, కోశాధికారి దరిపల్లి దుర్గయ్య, దరిపల్లి వెంకట్, కుమ్మరి సంఘం జిల్లా నాయకులు తరిగొప్పుల రామచంద్రం, నార్లాపురం రామ్మోహన్, కొలిపాక శ్రీనివాసు, గోవిందారం కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
సామాజిక కార్యకర్త నాగరాజు


