జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం పట్టణ పరిధి లోని అయ్యమ్మచెరువును అధ్యయన బృందం గురువారం తనిఖీ చేసింది. సమీపంలోని పరిశ్రమల నుంచి వచ్చి చేరుతున్న కాలుష్య జలాలతో చెరువు కాలుష్యమయంగా మారిందని తెలుసుకున్న అధ్యయన కమిటీ చైర్మన్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో కాలుష్య జలాల నమూనాలను సేకరించారు. పరిశ్రమల అవుట్‌లెట్లు నుంచి నేరుగా చెరువులోకి జలాలు విడుదల చేస్తుండడంతో చెరువు కాలుష్యమయానికి గురైందన్నారు. ఈ నీటి నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించిన అనంతరం వచ్చే నెల మొదటి వారంలో రిపోర్టు నివేదిక వెల్లడిస్తామన్నారు. సహజసిద్ధమైన చెరువులు, కుంటలు ప్రకృతి సిద్ధమైన సంపదను కాపా డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరావు, బీఎన్ మూర్తి, సూ ర్య నాయుడు, ఎనలిస్ట్ ఎంఆర్సీ రెడ్డి, మోడల్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధి శ్రీధర్ పాల్గొన్నారు.
తనిఖీ చేసిన అధ్యయన బృందం


