బావమరిదిపై హత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

బావమరిదిపై హత్యాయత్నం

Jul 10 2026 7:40 AM | Updated on Jul 10 2026 7:40 AM

మద్దూరు (హుస్నాబాద్‌): భార్య, పిల్లలను కొడుతుండగా అడ్డువచ్చిన బావమరిదిపై కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌ఐ మహ్మద్‌ ఆసిఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. దూళిమిట్ట మండలంలోని జాలపల్లికి చెందిన బందారం రమేష్‌ గత నెల 15న తన భార్య, పిల్లలను కొట్టాడు. విషయం తెలుసుకున్న రమేష్‌ బావమరిది తాళ్లపల్లి ప్రతాప్‌, అత్త కారులో అక్కడికి వచ్చారు. దీంతో కోపంతో రమేష్‌ వారి కారుపై బండరాయి వేసి ధ్వంసం చేయడమే కాకుండా, కల్లుగీసే కత్తితో ప్రతాప్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని జాలపల్లి శివారులో అరెస్టు చేసి చేర్యాల కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు తీర్పు చెప్పిన న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

నిందితుడికి 14 రోజుల రిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement