జహీరాబాద్: జహీరాబాద్‌లోని పస్తాపూర్ వద్ద జాతీయ రహదారి ఫ్లైవర్ పైనుంచి అదుపుతప్పిన లారీ సర్వీసు రోడ్డుపై బోల్తా పడింది. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఎస్‌ఐ లవకుమార్ కథనం ప్రకారం... మహారాష్ట్ర నుంచి ఉల్లిగడ్డ లోడ్‌తో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న లారీ ముందు టైరు పగిలిపోవడంతో అదుపుతప్పి ఫ్లైఓవర్ పైనుంచి పిట్టగోడను ఢీకొట్టి కింద ఉన్న సర్వీసు రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు కాలు విరిగింది. లారీ బోల్తా పడిన సమయంలో సర్వీసు రోడ్డుపై ఎలాంటి వాహనాలు వెళ్లకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం కారణంగా సర్వీసు రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. క్రేన్ సహాయంతో లారీని పక్కకు తప్పించి రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవర్‌కు గాయాలు తప్పిన ప్రమాదం


