మెదక్‌జోన్: క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్‌వర్క్ ట్రాకింగ్ సిస్టమ్(సీసీటీఎన్‌ఎస్) 2.0పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్ల సిబ్బందికి సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీటీఎన్‌న్‌ఎస్ 2.0 వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలంటే నిర్దేశిత సమయాన్ని పాటించడంతో పాటు డేటా నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎఫ్‌ఐఆర్‌లు, కేసు డైరీలు, దర్యాప్తు పురోగతి, చార్జిషీట్లు, తదితర వివరాలను నిర్దేశిత గడువులోగా నమోదు చేయాలని ఆదేశించారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన అప్‌డేట్లు, కొత్త ఫీచర్లు, వాటి వినియోగ విధానం, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు.
అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్


