శివకుమార్‌కు హరీశ్‌రావు పరామర్శ | - | Sakshi
Sakshi News home page

శివకుమార్‌కు హరీశ్‌రావు పరామర్శ

Jun 22 2026 7:03 AM | Updated on Jun 22 2026 7:03 AM

శివకుమార్‌కు హరీశ్‌రావు పరామర్శ

జహీరాబాద్‌: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ ఎం.శివకుమార్‌ను పరామర్శించారు. శివకుమార్‌ తండ్రి ఈశ్వరయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న హరీశ్‌రావు ఆదివారం జహీరాబాద్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య భౌతికకాయానికి నివాళులర్పించారు. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న శివకుమార్‌ను హరీశ్‌రావు ఓదార్చారు. ఎమ్మెల్యేలు కె.మాణిక్‌రావు, చింతా ప్రభాకర్‌, ఆయా కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు దేవిప్రసాద్‌, వై.నరోత్తం, ఎం.డి.తన్వీర్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, భిక్షపతిలతోపాటు ఆయా పార్టీల నాయకులు శివకుమార్‌ను పరామర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement