ఆధునిక సాగుతో అధిక దిగుబడులు | - | Sakshi
Sakshi News home page

ఆధునిక సాగుతో అధిక దిగుబడులు

Jun 21 2026 8:10 AM | Updated on Jun 21 2026 8:10 AM

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే ఆశించిన మేర దిగుబడులు పొందవచ్చని శాస్త్రవేత్తలు(ఏజీ హబ్‌) వెంకటేశ్వర్లు, జెల్ల సత్యనారాయణ, రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని గంగ్వార్‌ గ్రామ శివారులో రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం డిజిటల్‌ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...వ్యవసాయ రంగంలో ఖర్చులను తగ్గించి దిగుబడులు పెంచేందుకు డిజిటల్‌ వ్యవసాయం ఎంతగానో దోహద పడుతుందన్నారు. ఈ విధానం ద్వారా వ్యవసాయంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే తెలుసుకుని నివారణ చర్యలు చేపట్ట వచ్చని సూచించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు అడిగిన ప్రశ్నలను నివృతి చేశారు. కార్యక్రమంలో ఏజీ హబ్‌ శాస్త్రవేత్తలు శ్రీకాంత్‌రెడ్డి, బల్‌రాంరెడ్డి, డాక్టర్‌ విజయ్‌ కుమార్‌తో పాటు రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.

ఏజీ హబ్‌ శాస్త్రవేత్తలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement