తండ్రి కలను కొడుకులు సాధించారు | - | Sakshi
Sakshi News home page

తండ్రి కలను కొడుకులు సాధించారు

Jun 21 2026 8:04 AM | Updated on Jun 21 2026 8:04 AM

అమీర్‌ జానీ.. కష్టపడితే కానీ నోటికి ముద్ద అందని పరిస్థితి. 40 ఏళ్ల క్రితం క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. మంచి క్రికెటర్‌ కావాలనే ఆయన ఆశయానికి పేదరికం అడ్డుగా నిలిచింది. దీంతో కుటుంబ పోషణ కోసం తన కలను చెరిపేసి టెంట్‌హౌస్‌పై ఆధారపడ్డాడు.. సిద్దిపేట పట్టణానికి చెందిన అమీర్‌ జానీ. ఆగిపోయిన తన కల సార్థకత అయ్యేందుకు కుమారులకు క్రికెట్‌లో తనకు ఉన్న నైపుణ్యం వారికి అందించారు. తండ్రి, కోచ్‌ తరహాలో ద్విపాత్ర పోషించి వారిని ఉత్తమ క్రికెటర్లగా తీర్చిద్దేందుకు సర్వశక్తులు ఒడ్డాడు. తండ్రి లక్ష్యం కోసం ఇద్దరు కుమారులు అర్ఫాజ్‌, ఆఫ్రిదీ ఆటపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల టీజీ 20 వేలంలో మహ్మద్‌ అర్ఫాజ్‌ అహ్మద్‌(గోరు)ను అనురాగ్‌ నల్లగొండ నైట్‌ జట్టు రూ.11 లక్షలకు, మహ్మద్‌అఫ్రిదీని పాలమూరు స్టైకర్స్‌ జట్టు రూ 2.3లక్షలకు కొనుగోలు చేశాయి. ఇద్దరికి మొదటి క్రికెట్‌ కోచ్‌ నాన్న అమీర్‌ జానీనే అని అర్ఫాజ్‌, అఫ్రిదీ చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement