జిల్లాలో తొమ్మిది పరీక్ష కేంద్రాలు
సంగారెడ్డి జోన్: వైద్య కళాశాలల్లోని పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఈ నెల 21న ఆదివారం జరగనుంది. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే కేంద్రాలను గుర్తించి, అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణపై కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోశ్ పంకజ్ అధికారులతో సమీక్షించిన విషయం తెలిసిందే.
9 కేంద్రాలు.. 2,924 మంది అభ్యర్థులు
నీట్‌కు జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,924 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. అదేవిధంగా ఇన్‌చార్జులుగా తహసీల్దార్లను నియమించారు. ప్రభుత్వ తారా డిగ్రీ కళాశాల–సంగారెడ్డి, జేఎన్‌్ టీయూ 2 కేంద్రాలు, కేంద్రీయ విద్యాలయం (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర), సంగారెడ్డి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పోతిరెడ్డిపల్లి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళల జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల) పటానన్‌చెరు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు నిర్వహిస్తారు. బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, తనిఖీలు చేస్తారు.
హాజరు కానున్న
2,924 మంది అభ్యర్థులు
ప్రతీ పరీక్ష కేంద్రానికి చీఫ్‌సూపరింటెండెంట్ల నియామకం
అభ్యర్థులు వెంట తీసుకురావాల్సినవి
ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్
చేసుకున్న అడ్మిట్ కార్డు
ఆధార్‌కార్డు /పాన్ కార్డు/పాస్
పోర్ట్/స్టూడెంట్ ఐడీ వంటి ఒరిజినల్ ఫొటో గుర్తింపు కార్డు
రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒక పోస్ట్‌కార్డ్ సైజ్ ఫోటో
పారదర్శక (ట్రాన్సపరెంట్) నీటి బాటిల్ మాత్రమే
పాటించాల్సిన సూచనలు:
అడ్మిట్ కార్డులో పేర్కొన్న గేట్ క్లోజింగ్ సమయం (మధ్యాహ్నం1.30 గంటలు) కంటే ముందుగానే పరీక్ష కేంద్రానికిచేరుకోవాలి.
ఇన్విజిలేటర్ సమక్షంలో ఓఎంఆర్ షీట్, హాజరు పట్టికపై సంతకాలు చేయాలి.
పరీక్ష కేంద్రంలో ఎన్‌టీఏ అందించే బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి.


