రామచంద్రాపురం(పటాన్‌చెరు): నియోజకవర్గ పరిధిలోని భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెల్లాపూర్‌లో తెలంగాణ రాష్ట్ర భవన, ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీసాయినగర్ కాలనీ, ఎస్‌వీఎస్‌బీ అవతార్ అపార్ట్‌మెంట్‌లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు శ్రీశైలం, నాగరాజు, నాయకులు మల్లారెడ్డి, శ్రీపాల్ రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి


