న్యాల్‌కల్(జహీరాబాద్): ఓ ప్రార్థనాలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి యాంప్లిఫైయర్‌ను స్వాధీనం చేసుకున్నారు. హద్నూర్ ఎస్‌ఐ సుజిత్ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 14న మండల పరిధిలోని రాంతీర్థ్ గ్రామంలోని మసీద్‌లో రూ.16వేలు విలువ కలిగిన యాంప్లిఫైయర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మండల పరిధిలోని ముంగి చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా దొంగతనానికి పాల్పడిన సఫాన్, నోమన్ అనే వ్యక్తులు పట్టుబడ్డారు. విచారించగా రాంతీర్థ్‌లోని మసీదులో చోరీ చేసినట్లు నేరం అంగీకరించారు. నిందితులు బీదర్‌కు చెందిన వారుగా గుర్తించారు.


