కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి

Jun 20 2026 11:49 AM | Updated on Jun 20 2026 11:49 AM

నారాయణఖేడ్‌: మున్సిపల్‌ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.26వేల కనీస వేతనం చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్‌ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్‌ వర్కర్లు, కార్మికులతో రెండురోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. శుక్రవారం దీక్షాదారులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రం మున్సిపల్‌ కమిషనర్‌ ప్రశాంతికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులందరికీ రిటైర్డ్‌ బెనిఫిట్స్‌, హెల్త్‌ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించాలని, ఇందిరమ్మ ఇళ్లు, స్థలాలు, ఇతర మున్సిపాలిటీల తరహాలో ఇక్కడి మున్సిపల్‌ డ్రైవర్లకు 19,500 వేతనం చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ ఏరియా కార్యదర్శి రమేష్‌, మున్సిపల్‌ యూనియన్‌ కార్మిక సిబ్బంది శ్రీనివాస్‌, శ్రీనివాస్‌గౌడ్‌, కుమార్‌, రవి, శ్రావణ్‌, సురేష్‌, దిలీప్‌, అంబయ్య, రమేష్‌, దాస్‌, మదన్‌, కృష్ణ, ప్రవీణ్‌, ఏసు, రాజు, ప్రవీణ్‌, బాలప్ప, చంద్రకళ, శకుంతల, సాయమ్మ, సిద్దమ్మ, బేబీ, సునీత పాల్గొన్నారు.

కార్మికుల రిలే దీక్షలు

సంగారెడ్డి: మున్సిపల్‌ కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మనెంట్‌ చేయాలని, 11వ పీఆర్‌సీ ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో థర్డ్‌ పార్టీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ.25 లక్షల ఇన్సూరెన్స్‌, దహన సంస్కారాలకు రూ.30 వేలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌గా రూ.5 లక్షలు అందించాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సువర్ణ, నర్సమ్మ, సుగుణ, రాజు, లక్ష్మణ్‌, యాదయ్య, నర్సింలు, యాదగిరి, వేణుగోపాల్‌, కష్ణ,తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement