ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు

Jun 20 2026 11:49 AM | Updated on Jun 20 2026 11:49 AM

నారాయణఖేడ్‌: మండలంలోని ఎంపీ సురేష్‌ షెట్కార్‌ నివాసంలో మున్సిపల్‌ చైర్మన్‌ నగేష్‌ షెట్కార్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్‌ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సంజీవరెడ్డి నివాసంలో డీసీసీ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డిల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కేక్‌కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్‌గాంధీ దేశ సమగ్రత కోసం భారత్‌ జోడో యాత్ర చేపట్టి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

350 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ

సంగారెడ్డి: జిల్లా కేంద్రంలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 350 మంది చిన్నారులకు సైకిళ్లు పంపిణీ చేశారు. 200 కేజీల భారీ కేక్‌ని చిన్నారులతో కలిసి జగ్గారెడ్డి దంపతులు కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తొపాజి అనంత కిషన్‌, కూన సంతోష్‌, నాయకులు పాల్గొన్నారు.

జిన్నారంలో..

జిన్నారం (పటాన్‌చెరు): పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌ జాతీయ నాయకుడు రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శ్రీకాంత్‌ రెడ్డి, నాయకులు మన్నే రఘు, సురేష్‌, శివరాజ్‌, నరేందర్‌ గౌడ్‌, రవి, గోపాల్‌ రెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement