ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి

Jun 20 2026 11:49 AM | Updated on Jun 20 2026 11:49 AM

జహీరాబాద్‌ టౌన్‌: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ప్రభాకర్‌ మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లకు సూచించారు. స్థానిక మున్సిపల్‌ మీటింగ్‌ హాల్‌లో శుక్రవారం టీఎంసీ, డీఈఓ, మెస్మా రిసోర్స్‌ పర్సన్‌లతో సమీక్ష సమావేశం నిర్వహించి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయి సిబ్బందితో నిర్దేశించిన లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ఎస్‌హెచ్‌జీ సభ్యులతో కలిసి పనిచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో మెప్మా ఆర్‌పీలు, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement